Loading...

Explore Projects Across the Rajahmundry

యువతకు స్ఫూర్తి క్విట్‌ ఇండియా ఉద్యమం

యువతకు స్ఫూర్తి క్విట్‌ ఇండియా ఉద్యమం

ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ

ఆనంద్‌నగర్‌(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను పణంగా పెట్టిన స¾మరయోధుల త్యాగాలను అభివృద్ధితో సార్థకం చేద్దామని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పిలుపునిచ్చారు. క్విట్‌ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నగర భాజపా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కోటగుమ్మం కూడలి నుంచి కోటిపల్లి బస్టాండు వరకూ సాగిన ఈ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ముందుగా కోటగుమ్మం సెంటరులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విదేశీపాలన నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు ఎంతో మంది మహనీయులు ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు.

మహాత్మాగాంధీ సారధ్యంలోని క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని అణచి వేసేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గకుండా దేశ విముక్తి కోసం ముందుకు సాగించారని.. ఫలితంగా మనకు స్వాతంత్య్రం సిద్ధించడానికి మార్గం ఏర్పడిందన్నారు. ఈ ఉద్యమ స్ఫూర్తిని యువత తమలో నింపుకుని లక్ష్యసాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా సమరయోధులను కీర్తిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో భాజపా నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌, నాళం పద్మశ్రీ, అయ్యల గోపి, హీరాచంద్‌ జైన్‌, లాల్‌బహుదూర్‌ శాస్త్రి ఎన్‌.ఎస్‌.చంద్రశేఖర్‌, ఎస్‌.వి.రాణి, క్రొవ్విడి సురేష్‌, మట్టాడి చిన్ని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *