Loading...

Explore Projects Across the Rajahmundry

ముక్కోటికి ముస్తాబు

ముక్కోటికి ముస్తాబు

అన్నవరంలో రేపు తెల్లవారుజామున అయిదు గంటల నుంచి దర్శనాలు

అంతర్వేది, వాడపల్లి ఆలయాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు

అన్నవరం, న్యూస్‌టుడే: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈనెల 29న జిల్లాలో అన్నవరంతో పాటు అంతర్వేది, వాడపల్లి తదితర ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి ఉత్తరద్వార దర్శనానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ముక్కోటి రోజున శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మీ దేవి అలంకరణలో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆయా ఆలయాలకు వేలసంఖ్యలో భక్తులు తరలిరానుండడంతో దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నవరం దేవస్థానంలో తెల్లవారుజామున అయిదు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్తర ద్వారం ద్వారా స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకునేలా  ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందుకోసం ఉత్తర ద్వార మార్గం, ప్రధాన ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించనున్నారు. ఆ రోజున ఉదయం 9 గంటలకు ప్రాకారసేవ, రాత్రి గ్రామోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆలయంలో తెల్లవారుజామున 4.30 గంటల నుంచి సాయంత్రం వరకు స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే అవకాశం కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *