Loading...

Explore Projects Across the Rajahmundry

భీమవరం చేరుకున్న పవన్‌కల్యాణ్‌

భీమవరం చేరుకున్న పవన్‌కల్యాణ్‌

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జిల్లా పర్యటన రెండో విడతలో భాగంగా బుధవారం రాత్రి భీమవరం పట్టణానికి చేరుకున్నారు. సమీపంలోని నిర్మలాదేవి పంక్షను హాల్‌కు చేరుకున్నారు. హైదరాబాదు నుంచి రహదారి మార్గంలో వచ్చారు. గత నెల 23వతేదీన వచ్చి నాలుగురోజులపాటు జిల్లాలో ఉన్న సంగతి తెలిసిందే. మూడురోజులపాటు నిర్మలాదేవి పంక్షనుహాల్‌లో బస చేసి పలు సంఘాలతో సమావేశాలు నిర్వహించి 27వతేదీన భీమవరంలో బహిరంగ సభ నిర్వహించారు. 27వతేదీన వివిధ కార్యక్రమాల నిమిత్తం విజయవాడ వెళ్లారు. బుధవారం రాత్రి మళ్లీ భీమవరం చేరుకున్నారు. నిర్మలాదేవి పంక్షనుహాల్‌లోనే గురువారవం పలు సంఘాలతో సమావేశం నిర్వహించనున్నారు. బీసీ కులసంఘాలు, ఆటోయూనియన్లు, బ్రాహ్మణ సమాఖ్య, మేధావుల ఫోరం తదితర సంఘాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. 10వతేదీనుంచి పోరాటయాత్ర బహిరంగసభలు నిర్వహించనున్నారు. భీమవరంలో బసచేసి పాలకొల్లు, నరసాపురం, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో పోరాట యాత్ర నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఏ నియోజకవర్గంలో ఏ రోజు పర్యటించనున్నారనే షెడ్యూల్‌ గురువారం ప్రకటించనున్నారు. ఈనెల 13వతేదీ వరకు జిల్లాలో ఉంటారు. స్వాతంత్య్రదినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాదు వెళ్లనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *