Loading...

Explore Projects Across the Rajahmundry

ప్రభుత్వాసుపత్రిపై ప్రైవేటు సంస్థల అజమాయిషీ ..


ప్రభుత్వాసుపత్రిపై ప్రైవేటు సంస్థల అజమాయిషీ

ఏపీ ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల సంఘం ఆరోపణ

కాకినాడ నగరం:ప్రభుత్వాసుపత్రిపై ప్రైవేటు సంస్థల అజమాయిషీ….

ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్‌)పై ప్రైవేటు సంస్థ అజమాయిషీ పెరిగిందని ఏపీ ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఆస్కారరావు ఆరోపించారు.

స్థానిక సంఘ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రుల్లోని పారిశుద్ధ్య నిర్వహణను పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు సంస్థకు అప్పగించిందని తెలిపారు.

ఆ సంస్థ ఆ పనులను ఉప గుత్తేదారునికి అప్పగించిందని ఆరోపించారు.

పొరుగు సేవల విధానంలో నియమించిన పారిశుద్ధ్య సిబ్బందితో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని దుయ్యబట్టారు.

సిబ్బంది నియామకంలో రోస్టర్‌ విధానం అమలు చేయడం లేదన్నారు.

కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తూ రికార్డుల్లో ఎక్కువ చూపుతున్నారని ఆరోపించారు.

లోపాలను ఎత్తిచూపుతున్న కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నారని, ఇటీవల కొందరిని అకారణంగా తొలగించారన్నారు.

ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆస్పత్రి ఎదుట 14 రోజులుగా దీక్షలు చేస్తున్నా యాజమాన్యం స్పందించకపోవడాన్ని తప్పుపట్టారు.

దీనిపై అధికారులు చర్చలు జరిపినా సమస్యను పరిష్కరించలేదన్నారు.

కార్మికులకు న్యాయం చేయకుంటే, జీజీహెచ్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సబ్బతి ఫణేశ్వరరావు,

వైద్య ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు డీవీబీ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.