Loading...

Explore Projects Across the Rajahmundry

ప్రజాసమస్యలకు అనుగుణంగా పనిచేయాలి: కలెక్టర్‌


ప్రజాసమస్యలకు అనుగుణంగా పనిచేయాలి: కలెక్టర్‌

గండేపల్లి, న్యూస్‌టుడే:ప్రజాసమస్యలకు అనుగుణంగా పనిచేయాలి.

ప్రజల సమస్యలకు అనుగుణంగా పని చేసి పరిష్కారానికి అధికారులు త్వరిత గతిన స్పందించాలని జిల్లా కలక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలియజేశారు.

జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొని గ్రామస్థులతో మాట్లాడారు.

పింఛన్లు, రేషను సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలసుకున్నారు.

సరకులు సక్రమంగా ఇస్తున్నారని, కిరోసిన్‌ కావాలని మహిళలు తెలియజేశారు.

అనంతరం ఎలక్ట్రికల్‌ ఏఈ మీకు తెలుసా అని అడిగితే మాకు తెలియదని, విద్యుత్తు సరఫరా  సక్రమంగా ఉండడం లేదని స్థానికులు చెప్పారు.

నెల రోజుల్లో గ్రామంలో విద్యుత్తు వ్యవస్థను గాడిన పెట్టాలని లేకుంటే సస్పెండ్‌ చేస్తానని సంబంధిత అధికారిని హెచ్చరించారు.

గండేపల్లి సీఆర్పీ మీకు తెలుసా అని ప్రశ్నించగా ఎవరూ తెలియదని సమాధానం చెప్పారు.

అనంతరం గ్రామంలో నీటి సరఫరా అధ్వానంగా ఉందని శుద్ధ నీరు వస్తుందని చెప్పడంతో ఆశాఖాధికారులు వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలిన కలెక్టర్‌ ఆదేశించారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్డు ఇస్తున్నారా అని అడిగితే సక్రమంగా అందుతున్నాయని మరుగుదొడ్లు లేక

చిన్నారులు ఇంటికి వచ్చేస్తున్నారని చెప్పడంతో ఆశాఖ అధికారులపై కలక్టర్‌ ఆగ్రహం వ్యక్తం  చేశారు.

పుష్కర ఎత్తి పోతల పథకం ద్వారా వచ్చే నీరు పొలాలకు అందకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా దీనిపై దృష్టి సారిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అనంతరం సీఎం రీలీఫ్‌ ఫండ్‌ను గ్రామస్థులకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి అందజేశారు. అధికారులు సక్రమంగా పనిచేయకుంటే సస్పెండ్‌ చేస్తానని ఘాటుగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌ కందుల కొండయ్యదొర, పీడీ రాజకుమారి, అన్ని శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *