Loading...

Explore Projects Across the Rajahmundry

పౌష్టికం పక్కదారి !


పౌష్టికం పక్కదారి !

అంగన్‌వాడీ కేంద్రాల్లో అస్తవ్యస్త పరిస్థితులు

గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అరకొర సేవలు

  పాడైన సరకులు.. కుళ్లిన కూరగాయలతో మెనూ

 

 

ఈనాడు, కాకినాడ:   పౌష్టికం పక్కదారి !

జి ల్లాలో మండలాలు, నగరాలు, పట్టణాల్లోనూ ఐసీడీఎస్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఆయా కేంద్రాల్లో సౌకర్యాల లేమితో పాటు నిర్వహణలోనూ లోపాలు వెలుగు చూస్తున్నాయి.

జిల్లాలో మొత్తం 5,546 ప్రధాన, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా కేవలం 2,140 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి.

దీంతో పరాయి పంచన అరకొర సౌకర్యాల నడుమ కాలం వెళ్లదీయాల్సి వస్తోంది.

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడానికి సిబ్బంది కొరత కొంత కారణంగా కనిపిస్తోంది.

ప్లే స్కూళ్లకు దీటుగా వీటిని తీర్చిదిద్దాలన్న సంకల్పం నెరవేరడం లేదు.

అన్ని కేంద్రాలకు సొంత భవనాలు, విద్యుత్తు, తాగునీరు, ఫ్యాన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది.

ప్రతి కేంద్రం పరిధిలోనూ జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా)తో కలిసి పోషకాహార వనాలు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు ఉన్నా ఇదీ సరిగా అమలు జరగడం లేదు.

పుట్టిన బిడ్డ 2.5 కేజీల కంటే తక్కువ బరువుతో ఉండటం వల్ల శిశు మరణాలు చోటుచేసుకుంటున్నాయి.

గర్భం దాల్చిన క్రమంలో తల్లికి సరైన పౌష్టికాహారం, వైద్య సేవలు అందక మాతృమరణాలు సంభవిస్తున్నాయి.

ఈ రెండింటినీ అధిగమించాలంటే ప్రభుత్వం కేటాయిస్తున్న పౌష్టికాహారం సమర్థంగా అందాలి.

కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో దస్త్రాల్లో చూపుతున్న హాజరుకు, వాస్తవ పరిస్థితికి పొంతన ఉండటం లేదు.

ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వదిలేస్తుండటంతో సరకులు పక్కదారి పట్టేందుకు ఆస్కారం ఏర్పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *