
పాన్ – ఆధార్ లింకింగ్ : మరోసారి ఊరట
పాన్ – ఆధార్ లింకింగ్ : మరోసారి ఊరట
PAN aadhaar linking once again
- ఆధార్‌తో పాన్ వివరాలను లింక్ చేయని వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) వారికి శుభవార్త అందించింది. pan aadhaar linking once again.
- పాన్ – ఆధార్ లింకింగ్ తేదీని పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ సోమవారం రాత్రి ట్వీట్ చేసింది.
- నేటితో( డిసెంబర్ 31, 2019) గడువును దీనిని మరో మూడు నెలల పాటు పొడిగించింది.
- ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 139ఏఏ లోని ఉప-సెక్షన్ 2 కింద పేర్కొన్న విధంగా పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి వచ్చే ఏడాది (2020) మార్చి 31వ తేదీ వరకు దీనిని పొడిగించింది.
- పాన్-ఆధార్ లింకింగ్‌ను ఇప్పటికే పలుమార్లు పొడిగించిన సీబీడీటీ తాజాగా గడువును పొడిగించడం ఇది ఎనిమిదోసారి.
- పాన్-ఆధార్ అనుసంధానం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేంద్రం తప్పనిసరి చేసింది.
- ఇటీవల ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి తప్పనిసరి అయింది.
- డిసెంబర్ 31వ తేదీలోపు ఆధార్ అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లదని ఐటీ శాఖ తెలిపింది.