Loading...

Explore Projects Across the Rajahmundry

నేడు రూ.10 కోట్ల పెట్టుబడి నిధి పంపిణీ

నేడు రూ.10 కోట్ల పెట్టుబడి నిధి పంపిణీ

జిల్లా సచివాలయం(కాకినాడ), న్యూస్‌టుడే(10 crore investment fund): డ్వాక్రా సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 కోట్ల పెట్టుబడి నిధిని మంగళవారం సామర్లకోటలోని టీటీడీసీ వద్ద పంపిణీ చేస్తారని డీఆర్‌డీఏ పీడీ మల్లిబాబు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా పెట్టుబడి నిధి(పసుపు, కుంకుమ) మంజూరు పత్రాలు 33,417 మంది డ్వాక్రా మహిళలకు అందజేస్తారని తెలిపారు. డ్వాక్రా సంఘాల పిల్లలకు ఉపకార వేతనాలు, ఎస్సీ ఉప ప్రణాళిక నిధులతో మంజూరైన బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేస్తారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *