Loading...

Explore Projects Across the Rajahmundry

నేడు జగ్గంపేటలో బహిరంగ సభ

నేడు జగ్గంపేటలో బహిరంగ సభ

YS Jagan Public Meeting In Jaggampeta East Godavari - Sakshi

100వ నియోజకవర్గంగా ప్రాధాన్యత

పాదయాత్రలో ప్రజలతో మమేకం కానున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రశనివారం పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లో  కొనసాగనుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కష్టాల్లో ఉన్న వారికి భరోసానిస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్న పాదయాత్ర పెద్దాపురం మండలం కట్టమూరు క్రాస్‌ నుంచి ప్రారంభం కానుంది. పెద్దాపురం మండలం తిమ్మాపురం, జగ్గంపేట మండలం కాట్రావులపల్లి క్రాస్, సీతానగరం క్రాస్, జగ్గంపేటలలో పాదయాత్ర సాగుతుంది.

100వ నియోజకవర్గంగా జగ్గంపేట
ప్రజా సంకల్పయాత్ర నేటితో దిగ్విజయంగా 222వ రోజుకు చేరుకుంది. 99 నియోజకవర్గాలను పూర్తి చేసుకుని 100వ నియోజకవర్గంగా జగ్గంపేటలో జగన్‌ ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం జగ్గంపేటలో జరిగే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించనున్నారు.

రేపు కో ఆర్డినేటర్లతో జగన్‌ సమావేశం
జగ్గంపేట: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి జగ్గంపేటలో పార్టీ కో ఆర్డినేటర్లతో ఆదివారం నిర్వహించనున్న సమావేశం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. స్థానిక బాలాజీ లే అవుట్‌ వద్ద నిర్వహిస్తున్న సమావేశానికి పార్టీ అసెంబ్లీ, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షలు, రీజనల్‌ కో ఆర్డినేటర్లు, ముఖ్య నాయకులు హాజరవుతుండడంతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటరు తలశిల రఘురాం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *