Loading...

Explore Projects Across the Rajahmundry

Today's students are tomorrow's patrons

నేటి విద్యార్థులే రేపటి దేశరక్షకులు

నేటి విద్యార్థులే రేపటి దేశరక్షకులు

 

రిపబ్లిక్‌డే పరేడ్‌కు హాజరైన విద్యార్థి అచ్యుతవర్థన్‌ను అభినందిస్తున్న ఎన్‌.ఎన్‌.రెడ్డి

కాకినాడ(గాంధీనగర్‌): నేటి విద్యార్థులే రేపటి దేశ రక్షణ గావించే సైనికులని ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఎన్‌.ఎన్‌.రెడ్డి పేర్కొన్నారు. కాకినాడలోని గాంధీనగర్‌లోని మహాత్మాగాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలోని ఎన్‌సీసీ ట్రూప్‌ను బుధవారం ఆయన సందర్శించారు. జిల్లా పర్యటనలో భాగంగా పాఠశాలకు వచ్చిన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల ఎన్‌సీసీ మోటివేషన్‌ హాలును ప్రారంభించారు. ఈ ఏడాది నుంచి క్యాడెట్స్‌కు నేరుగా వారీ ఖాతాలకే యూనిఫాం కుట్టించుకునేందుకు అవసరమైన మొత్తాన్ని జమ చేస్తామన్నారు. కాకినాడ ఎన్‌సీసీ గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ కె.వి.శ్రీనివాసు మాట్లాడుతూ గాంధీనగర్‌ పాఠశాలలో ఎన్‌సీసీ కార్యక్రమాలు సంతృప్తికరంగా సాగుతున్నాయన్నారు. తదుపరి బెటాలియన్‌ కమాండింగ్‌ అధికారి లఫె్టినెంట్‌ కల్నల్‌ సందీప్‌సింగ్‌ ఎన్‌సీసీలో చేరిన విద్యార్థులను అభినందించారు. 41వ డివిజన్‌ కార్పొరేటర్‌ గోడి సత్యవతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.