Loading...

Explore Projects Across the Rajahmundry

Development of the country

నదుల అనుసంధానంతో దేశాభివృద్ధి

నదుల అనుసంధానంతో దేశాభివృద్ధి

శాసన మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: నదుల అనుసంధానంతో దేశాభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. ఆయన బుధవారం సాయంత్రం లొల్ల లాకుల వద్ద ప్రాజెక్టు కమిటీ ఛైం¹్మన్‌ సాయిబాబు రాజు అధ్యక్షతన జరిగిన మధ్య డెల్టాలోని గోదావరి జలసిరికి హారతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జలవనరుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.255 కోట్లు కేటాయించిందన్నారు. సాగు, తాగునీటిని సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉందన్నారు. జలసిరే ప్రగతికి ఆధారమన్నారు. రాజోలు శాసనసభ్యుడు గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.
పి.గన్నవరం శాసనసభ్యుడు పులపర్తి నారాయణమూర్తి మాట్లాడుతూ జలవనరుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కోనసీమలోని బ్యాంకు కెనాల్‌ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. ఇందు కోసం రూ.2 కోట్లు కేటాంచారన్నారు. అనంతరం జంట లాకుల వద్ద గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ వాకలపూడి వెంకటకృష్ణారావు, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ కె.వి.సత్యనారాయణరెడ్డి, వాడపల్లి దేవస్థాన పాలకమండలి ఛైర్మన్‌ కరుటూరి నరసింహారావు, డీసీసీబీ డైరెక్టర్‌ చిలువూరి రామకృష్ణంరాజు, తెదేపా నేతలు బండారు సంజీవ్‌, ముళ్లపూడి భాస్కరరావు, ఈఈ సుధాకర్‌, డీఈ శ్రీనివాస్‌, ఏఈలు రాజమౌళి, శ్రీనివాస్‌, తహసీల్దారు వరదా సుబ్బారావు, ఎంపీడీవో జె.ఎ.ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
జలాన్ని సంరక్షించుకుందాం…
ధవళేశ్వరం: వృథా జలాలను సంరక్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, దీనికి అందరూ సహకరించాలని రాజమహేంద్రవరం పార్లమెంట్‌ సభ్యుడు మాగంటి మురళీమోహన్‌, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ధవళేశ్వరం సర్‌ఆర్థర్‌ కాటన్‌ జిల్లా పరిషత్తు బాలురోన్నత పాఠశాల ఎదురుగా ఘాట్‌ వద్ద నీటితోనే జగతి.. నీటితోనే ప్రగతి.. జలసిరికి హారతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడారు. తొలుత తూర్పుడెల్టా పరిధిలో ఘాట్‌ వద్ద ఎమ్మెల్యే గోరంట్ల శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గోదావరి మాతకు పట్టువస్త్రాలు సమర్పించి జలసిరి హారతినిచ్చారు. అనంతరం జరిగిన సదస్సులో ఎంపీ మురళీమోహన్‌ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో జలాలను సంరక్షించుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. నదుల అనుసంధానంతో జలసిరి లభిస్తుందనే ఉద్దేశంలో సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. గతంలో కృష్ణా నదిలో నీరు ప్రవహించేది కాదని..

గోదావరి తదితర నదుల అనుసంధానంతో జలసిరి ఉట్టిపడుతుందన్నారు. ఈ ఏడాదిలో గోదావరి నుంచి వందల టీఎంసీల నీరు సముద్రం పాలైందన్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ వృథాగా పోతున్న జలాలను సంరక్షించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. ఆ దిశగానే కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార నదుల అనుసంధానానికి కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఉన్న జలాలను సంరక్షించుకోకపోతే నీటి యుద్ధాలు జరిగే అవకాశం ఉందన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *