Loading...

Explore Projects Across the Rajahmundry

నదీ పరీవాహక ప్రాంతాల్లో పర్యాటకుల రక్షణకు చర్యలు

నదీ పరీవాహక ప్రాంతాల్లో పర్యాటకుల రక్షణకు చర్యలు

రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ సలహాదారుడు దుర్గాప్రసాద్‌

ఆనంద్‌నగర్‌(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: నదీ పరీవాహక ప్రాంతాల్లో పర్యాటకుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ సలహాదారుడు కోడే దుర్గాప్రసాద్‌ అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం వచ్చిన ఆయన గోదావరి గట్టు పద్మావతీ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన చిత్రాంగి బోటును పరిశీలించారు. డ్రైవరుకు లైసెన్సు ఉందా లేదా? పూర్తిస్థాయిలో శిక్షణ పొందాడా లేదా అని పరిశీలించారు. బోట్లకు సంబంధించి ఎన్ని లైఫ్‌జాకెట్లు ఉన్నాయో తనిఖీ చేశారు. ప్రయాణికుల ట్రిప్‌షీట్‌ తనిఖీ చేశారు. స్పీడు బోటుపై సరస్వతీఘాట్‌, వీఐపీ ఘాట్‌, పరిశీలించి పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. విలేకర్లతో మాట్లాడారు. నదీ పర్యాటకుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా బోట్లను పరిశీలించినట్లు తెలిపారు. గుర్తించిన అంశాలను, లోటుపాట్లను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఆయన వెంట రాష్ట్ర పోర్టుల సంచాలకుడు కె.ప్రవీణ్‌, మధ్య మండల డీఎస్పీ కులశేఖర్‌, మూడో పట్టణ సీఐ మారుతీరావు, ఎస్సైలు రాజశేఖర్‌, విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *