Loading...

Explore Projects Across the Rajahmundry

దేశభక్తి నిండుగా… ఉత్సాహం మెండుగా…

దేశభక్తి నిండుగా… ఉత్సాహం మెండుగా…

రాజమహేంద్రవరం సాంస్కృతికం: జెండా పండుగకు చిన్నారులు, యువత ముందుగానే స్వాగతం పలికారు. దేశభక్తిని చాటుతూ వీరు చేసిన నృత్యాలు…సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో స్థానిక పుష్కరఘాట్‌ వద్ద జరిగిన ‘ఆనంద ఆదివారం’ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. యువత, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని సందడి చేశారు.

నగరానికి చెందిన చిన్నారులు సంప్రదాయ దుస్తులతో దేశం మనదే.. తేజం మనదే అంటూ జాతీయ జెండాతో చేసిన ప్రదర్శన, దేశభక్తి గీతాలతో నిర్వహించిన నృత్య ప్రదర్శనకు కరతాళధ్వనులు మిన్నంటాయి. కమిషనర్‌ విజయ్‌రామరాజు, డిప్యూటీ కమిషనర్‌ ఫణిరామ్‌, మేనేజర్‌ శ్రీనివాసరావు, శైలజావల్లి, సూపరింటెండెంటü ఇంజినీర్‌ ఓంప్రకాష్‌ పాల్గొన్నారు.

కాగితపు గ్లాసులతో భారతదేశ పటం
కాగితపు గ్లాసులతో భారతదేశ పటాన్ని తయారు చేసి తమ దేశభక్తిని చాటుకున్నారు హజనబాద జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థినులు. 7వ తరగతి చదువుతున్న మహాలక్ష్మి, దివ్యశ్రీ, వినీత, శైలు, ప్రణతి కలసి పేపరు గ్లాసులను భారతదేశ పటం ఆకారంలో పేర్చి వాటిలో పైవరుసల్లో కాషాయం, మధ్యలో తెలుపు, కింది వరుసల్లో పచ్చ రంగు నీటిని నింపారు.

ఈ చిత్రపటం తయారీకి 480 గ్లాసులను ఉపయోగించారు. దేశాన్ని ప్లాస్టిక్‌ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కాగితపు గ్లాసులను ఉపయోగించినట్లు వారు వివరించారు. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయిని లక్ష్మితో పాటు ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.

– న్యూస్‌టుడే, ద్రాక్షారామ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *