Loading...

Explore Projects Across the Rajahmundry

‘తూర్పు’ ఉత్సవాలకు రూ.10 కోట్లు

‘తూర్పు’ ఉత్సవాలకు రూ.10 కోట్లు

రాజమహేంద్రవరం, ఈనాడు(‘Eastern’ festivals) : జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేస్తూ పర్యాటకంగా మరింత ప్రాధాన్యం సంతరించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా రాజమహేంద్రవరం పర్యాటక హబ్‌ పరిధిలో వివిధ ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ.10 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలాన ఆమోదం ఇచ్చింది. వీటిలో ప్రధానంగా కాకినాడ స్మార్ట్‌సిటీకి మరింత ఖ్యాతి తెచ్చేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌తో ప్రత్యేక సంగీత విభావరి కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. సంక్రాంతి సంబరాలను కోనసీమలో నిర్వహించాలని సంకల్పించారు. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా వీటికి రెండు రోజుల పాటు భారీగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *