Loading...

Explore Projects Across the Rajahmundry

జాతీయ ఈత పోటీలో

జాతీయ ఈత పోటీలో

యానాంకు పసిడి, వెండి పతకాలు

యానాం,  న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని మాల్పే బీచ్‌లో జాతీయ స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన జాతీయ స్థాయి ఓపెన్‌ కేటగిరీ ఈత పోటీల్లో యానాం క్రీడాకారులు ప్రతిభ చూపారు. సముద్రంలో ఒక కిలోమీటరు దూరం ఈత పోటీలో యానాం సాయి జూనియర్‌ కాలేజీ ఇంటర్మీడియెట్‌ విద్యార్థి ఎస్‌.వి.ఎస్‌.శ్రీకర్‌ అందరికన్నా ముందు లక్ష్యం చేరుకుని బంగారు పతకం సాధించాడు. కిలోమీటరు దూరం మహిళల విభాగంలో పోటీ పడిన యానాంకు చెందిన యువతి పాలెపు లక్ష్మి వెండి పతకం సాధించింది. ఉడిపి వద్ద సముద్రంలో ఈత పోటీలు శని, ఆదివారాలు జరగనున్నాయి. పోటీల్లో పాల్గొనేందుకు మొత్తం ఎనిమిది మంది క్రీడాకారులు యానాం నుంచి కోచ్‌ ఉదయకుమార్‌  నేతృత్వంలో వెళ్లారు.పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు విజేతలకు అభినందనలు తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *