Loading...

Explore Projects Across the Rajahmundry

చదువు మానేసిన వారికి సార్వత్రిక విద్య వరం


చదువు మానేసిన వారికి సార్వత్రిక విద్య వరం

సామర్లకోట, న్యూస్‌టుడే :

వివిధ కారణాల వల్ల మధ్యలో చదువు మానేసిన వారికి ఓపెన్‌ స్కూలు వరమని రాష్ట్ర సార్వత్రిక విద్యాపీఠం సమన్వయకర్త పి.సాయిబాబా పేర్కొన్నారు.

ఆదివారం స్థానిక అయోధ్యరామపురం బచ్ఛు ఫౌండేషన్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఓపెన్‌ స్కూలును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక కారణాల వల్ల, కుటుంబ పరంగా కలిగే ఇబ్బందులు వల్ల మధ్యలో చదువు మానేసిన వారు చదువు కొనసాగించేందుకు  ఓపెన్‌ స్కూలు ఎంతో దోహదపడుతుందన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

అనంతరం తరగతులు నిర్వహిస్తున్న గదులను, విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు.

సెలవు దినాల్లో తరగతులకు హాజరు కావడం వల్ల పరీక్షల్లో సులువుగా ఉత్తీర్ణత కావచ్చన్నారు.

ఓపెన్‌ స్కూలులో ప్రవేశం పొందడానికి అక్టోబర్‌ 15వ తేదీ వరకు గడువు ఉందన్నారు.

జిల్లా సమన్వయ కర్త కె.జనార్థన్‌ రావు, అధ్యయన కేంద్ర సమన్వయకర్త తోటకూర సాయిరామకృష్ణ, తాళ్లూరి వైకుంఠం, శివప్రసాద్‌, నూకరాజు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *