Loading...

Explore Projects Across the Rajahmundry

గ్రామీణ మాల్‌ü్సగా చౌక ధరల దుకాణాలు

గ్రామీణ మాల్‌ü్సగా చౌక ధరల దుకాణాలు

పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

వేళంగి(కరప), న్యూస్‌టుడే: పేద ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపంపిణీ వ్యవస్థలోని చౌక ధరల దుకాణాలను గ్రామీణ మాల్స్‌గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కరప మండలం వేళంగిలోని పౌరసరఫరాల శాఖ గోదాములో ఆకస్మిక తనిఖీ చేశారు. గోదాములో ఉన్న బియ్యం, పంచదార, కందిపప్పుల రికార్డులను, సరకుల నాణ్యత, నిల్వలను పరిశీలించారు. అనంతరం మంత్రి స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి కడుపునిండా అన్నం పెట్టడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలకు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి, అన్న అమృత హస్తం పథకానికి ఇక నుంచి సోనామసూరి రకం బియ్యాన్ని సరఫరా చేసేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, తాము యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నామన్నారు. ఇటీవల గుంటూరులో చౌక దుకాణాల్లో సరఫరా చేస్తున్న సరకుల్లో నాణ్యత లేనట్లు వస్తున్న ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి ప్రజలకు నాణ్యతతో కూడిన సరకులు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.

మార్కెట్‌లో నిత్యావసరాల ధరల అదుపునకు నాణ్యమైన సరకులను చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు విక్రయించడానికి గ్రామీణ మాల్‌ü్స విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు నిర్ణయించాం. ఇందులో భాగంగా డీలర్ల వ్యవస్థను బలోపేతం చేసేవిధంగా అలాగే రాష్ట్రంలో ఉన్న 29వేల మంది డీలర్లకు ఆదాయం పెంచేలా చేయడంతో పాటు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు బహిరంగ మార్కెట్‌ కంటే 20శాతం తక్కువ ధరకు నిత్యావసర సరకులను విక్రయించేలా మా శాఖ ప్రణాళిక రూపొందించిందన్నారు. నాణ్యత లేకపోయినా, తక్కువ తూకం వచ్చినా గోదాం నుంచి సరకులు తీసుకోవద్దని, రేషన్‌ దుకాణాల్లో ప్రజలకు తూకాల్లో తేడా వస్తే డీలర్లదే బాధ్యత అని మంత్రి అన్నారు. రేషన్‌ దుకాణాల వద్ద నగదు రహిత లావాదేవీలు తప్పనిసరి కాదని, వినియోగదారుల ఇష్టం మేరకు సరకులను కొనుగోలు చేసుకోవచ్చని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. డీఎస్‌వో వి.రవికిరణ్‌, డివిజనల్‌ అధికారి ఏ.దృష్ణారావు, ఏఎస్‌వో పీతల సురేష్‌, కరప, తాళ్లరేవు మండలాల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *