Loading...

Explore Projects Across the Rajahmundry

క్రీడల్లో బాలల నైపుణ్యం పెరగాలి

క్రీడల్లో బాలల నైపుణ్యం పెరగాలి

విద్యార్థులకు వ్యాయామ అక్షరాస్యత అవసరం

సబ్బవరం, న్యూస్‌టుడే: బాలలకు క్రీడల్లో నైపుణ్యం పెంచాల్సిన బాధ్యత పీఈటీల మీద ఉందని రాష్ట్ర యోగ, క్రీడల విభాగ అధికారి పి.రవీంద్రనాధ్‌ అన్నారు. క్రీడల్లో బాలల నైపుణ్యం పెంచేందుకు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోని పీఈటీలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని మంగళవారం విశాఖజిల్లా సబ్బవరం కస్తూరిబా బాలికా విద్యాలయంలో నిర్వహించారు. విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం, వ్యాయామ అక్షరాస్యతపై అవగాహన కల్పించాల్సింది పీఈటీలేనని అన్నారు.

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌, ఖేలో ఇండియా క్రీడలకు విద్యార్థులను తయారు చేయడానికి కేజీబీవీల్లోని పీఈటీలకు ఒక రోజు శిక్షణ ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 45లక్షల మంది ఏటా క్రీడల్లో పాల్గొంటున్నారని, వీరిలో కేజీబీవీ విద్యార్థి´నులు 71వేల ఉంటున్నారని అన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు తప్పనిసరి అని బాలికాశిశు అభివృద్ధి అధికారిణి స్వప్న ప్రియారెడ్డి అన్నారు. కార్యక్రమంలో రీజినల్‌ క్రీడా అధికారులు పి.సుధాకర్‌, జి.శ్రీనివాసరాజు, సబ్బవరం కేజీబీవీ సూపరింటెండెంట్‌ సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *