Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/themes/inspiry-real-places/style.css/home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-content/plugins/inspiry-real-estate/inspiry-real-estate.php
Deprecated: Function create_function() is deprecated in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/pomo/translations.php on line 208
కోరిన కోర్కెలు తీర్చే తల్లి..అచ్చమ్మ పేరంటాలు – Rajahmundry Real Estate
Loading...

Explore Projects Across the Rajahmundry

కోరిన కోర్కెలు తీర్చే తల్లి..అచ్చమ్మ పేరంటాలు

కోరిన కోర్కెలు తీర్చే తల్లి..అచ్చమ్మ పేరంటాలు

నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం

దెందులూరు, న్యూస్‌టుడే

అచ్చమ్మ పేరంటాలు ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 18వ శతాబ్దం చివరిలో జరిగిన యదార్థ సంఘటనగా అచ్చమ్మ పేరంటాలు తల్లి చరిత్రను చెబుతారు. ఆ తర్వాత ఏటికేడు పెరుగుతున్న భక్తుల జనసందోహం అమ్మవారి చరిత్రకు అద్దం పడుతుంది. అచ్చమ్మ పుట్టిల్లు దెందులూరు మండలం గాలాయగూడెం కావడంతో  పాటు ఆమె సతీసహగమనం చేసింది కూడా అక్కడే. పేరంటాలుగా సూచక క్రియలు చేసిందీ అక్కడే కావడంతో గ్రామస్థులు అమ్మవారికి ఆలయం కట్టి పూజలు చేస్తున్నారు. గాలాయగూడెం గ్రామానికి చెందిన అచ్చమ్మకు శనివారపుపేట జమిందారు వద్ద గుమాస్తాగా పనిచేస్తున్న వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. గాలాయగూడెం గ్రామం కూడా ఇదే జమిందారు పరిధిలో ఉండేది.

అచ్చమ్మ భర్త నిజాయతీగా పనిచేస్తూ జమిందారుకు అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. ఇక్కడ పనిచేస్తున్న కొందరికి అతని పట్ల ఈర్ష్య పెరిగింది.  అతనిపై కక్ష పెంచుకున్నారు. అచ్చమ్మ పుట్టింటికి వచ్చిన సమయంలో ఒకరోజు రాత్రి అచ్చమ్మ భర్తను గాలాయగూడెం వెళదామంటూ వారు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆలయం ఉన్న చోట అతనిని చంపారు. తెల్లారిన తర్వాత విషయం అంతటా తెలుస్తుంది. గ్రామంలోనే ఉన్న అచ్చమ్మ ఇంటి నుంచి పసుపు, కుంకుమ తీసుకుని చనిపోయిన భర్త వద్దకు చేరుకుని భర్తతో పాటు తనను కూడా దహనం చేయాలని వేడుకొంది. మొదట ఒప్పుకోని బంధువులు తర్వాత అంగీకరించారు.

ఈ సందర్భంగా ఆమె ఇంటి నుంచి తీసుకు వచ్చిన పసుపు, కుంకుమలను అక్కడికి వచ్చిన వారందరికీ ఇచ్చి శరీరాలు పూర్తిగా కాలిపోయే వరకు చల్లాలని కోరింది. గ్రామస్థులు అదే విధంగా చేశారు. ఇది జరిగిన 3వ రోజు గ్రామస్థుల కలలోకి వచ్చి పేరంటాలు అయ్యానని గుడి కట్టాలని కోరింది. దీనిపై గ్రామస్థులు నిదర్శనం అడిగారు. మాఘ పౌర్ణమినాడు అగ్నిగుండం ఏర్పాటు చేస్తే ఎవరో ఒకర్ని ఆవహించి అందులో నడుస్తానని చెప్పింది. చెప్పిన విధంగా గ్రామస్తులలో ఒకర్ని ఆవహించి  అగ్నిగుండంలో నడిచింది.

9 రోజులకు చేరిన ఉత్సవాలు
1957కు ముందు వరకు ఒక రోజు మాత్రమే చేసిన ఉత్సవాలను తర్వాత మూడు రోజులు పాటు చేశారు. 1967లో ఐదు రోజులు చేశారు. ఆలయం కట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2007లో  ఏడు రోజులు పాటు ఉత్సవాలు చేశారు. 2016లో 60 సంవత్సరాలు పూర్తి కావడంతో షష్టిపూర్తి సందర్భంగా 9 రోజులు చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా,  ఖమ్మం జిల్లాల నుంచి భక్తులు అమ్మవారి ఉత్సవాలకు హాజరవుతున్నారు.అచ్చమ్మ పేరంటాలు తల్లి ఉత్సవాల్లో అగ్నిగుండం ప్రవేశం అత్యంత ప్రధానమైంది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో అమ్మవారికి మొక్కుకున్న వారు అగ్నిగుండంలో నడుస్తారు. ఇది ముగిసిన తర్వాత వచ్చిన బూడిదను భక్తులు తీసుకుపోతారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/class-wp-comment-query.php on line 810

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/class-wp-comment-query.php on line 810

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/RAJAHMUNDRYREALESTATE.NET/wp-includes/class-wp-comment-query.php on line 388

Leave a Reply

Your email address will not be published.