Loading...

Explore Projects Across the Rajahmundry

కబళిస్తున్న కడలి

కబళిస్తున్న కడలి

సముద్రపు కోతతో నానాటికీ తరిగిపోతున్న తీర ప్రాంతం
తీరం వెంట ఆక్రమణలే ఉత్పాతానికి ప్రధాన కారణం
పలు చోట్ల 100 మీటర్లకు పైగా ముందుకు వచ్చిన సంద్రం
నీటిలో కలిసిపోతున్న వందల ఎకరాల అటవీ, పర్రభూములు
న్యూస్‌టుడే, అమలాపురం
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రెండు రోజుల నుంచి ఓడలరేవు, కొమరగిరిపట్నం, అంతర్వేది, ఉప్పాడ తదితర తీరప్రాంతాల్లో సముద్రం ఉవ్వెత్తున విరుచుకుపడింది.. సుమారు 150 మీటర్ల మేర ముందుకు చొచ్చుకువచ్చి తీరప్రాంత ప్రజలను కలవరపాటుకు గురిచేసింది..

ఎగసిపడుతున్న రాకాసి అలలను అడ్డుకునే రక్షణ కవచం కనుమరుగైపోవడంతో ఆ నీరు మరో 300 మీటర్ల వరకు ముందుకొచ్చింది. ఆ ధాటికి రోడ్లు, ఆవాసాలు, తీరప్రాంత భూములు కోతకు గురవుతున్నాయి. అల్లవరం మండలం ఓడలరేవులోని ఓఎన్జీసీ క్షేత్రం వరకు సముద్రం నీరు పొంగి ప్రవహించింది. ఈ ప్రభావానికి తీరాన్ని ఆనుకుని ఉన్న రోడ్డు చాలావరకు కోతకు గురైంది. కోనసీమ పరిధిలో దాదాపు 120 హెక్టార్ల మేర అటవీ శాఖకు చెందిన భూములు పదిహేనేళ్లలో సముద్ర గర్భంలో కలిసిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అల్లవరం మండలం ఓడలరేవు, కొమరగిరిపట్నం గ్రామ పరిధిల్లోనే తీరం వెంట దాదాపు 30 హెక్టార్ల సరుగుడు చెట్లు ఉండే అటవీశాఖకు చెందిన భూమి కనుమరుగైనట్లు అధికారిక అంచనాలున్నాయి. ఇవే కాక ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అసైన్డ్‌, జిరాయితీ భూములు కూడా కనుమరుగవుతున్నాయి. ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు ప్రాంతాల్లో పూర్తిగా వెనుకనీటితో నిండిఉన్న అల్లిపర్ర భూములు దాదాపు 180 హెక్టార్లు సముద్రంలో కలిసిపోయాయి.

కాకినాడ, కొత్తపల్లి మండల పరిధిలోని ఉప్పాడ, తుని గ్రామీణ మండలంలోని తొండంగి తదితర ప్రాంతాల్లో ఉన్న అసైన్డ్‌ భూములదీ ఇదే పరిస్థితి. యు.కొత్తపల్లి మండలంలోని కోనపాపపేట, ఉప్పాడ ప్రాంతాల్లో మత్స్యకారుల ఆవాసాలు సముద్రపు అలలకు కోతకు గురవుతున్నాయి. జిల్లాలోని తీరప్రాంతంలో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. సముద్ర అలల ధాటికి భూమి భారీగా కోతకు గురవుతోంది. వాతావరణ స్థితిగతుల నేపథ్యంలో వారం రోజులుగా ఉగ్రరూపం దాల్చిన సముద్రం భీకర అలలతో తీరంపై విరుచుకుపడింది. కెరటాల ఉద్ధృతికి 100 మీటర్లకు పైగా సముద్రం నీరు ముందుకు వచ్చింది. ఈ పరిస్థితులు తీరప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. జిల్లాలో సఖినేటిపల్లి మండలం అంతర్వేది నుంచి తొండంగి మండలం అద్దరిపేట వరకు సుమారు 127 కిలో మీటర్ల మేర సముద్ర తీరం ఉంది. తరచూకెరటాలు ముందుకు చొచ్చుకువస్తూ తీరాన్ని కోతకు గురిచేస్తున్నాయి. ఈ ప్రభావానికి విలువైన భూములు కడలిలో కలిసిపోతున్నాయి.
సీఆర్‌జడ్‌ పరిధి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *