Loading...

Explore Projects Across the Rajahmundry

English definitely needed

కచ్చితంగా ఇంగ్లీష్‌ భాష అవసరమే..

కచ్చితంగా ఇంగ్లీష్‌ భాష అవసరమే..

English definitely needed:

  • ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
  •  ఆంగ్లభాషను ప్రోత్సహించడంలో తప్పులేదని.
  • ప్రభుత్వాన్ని తప్పు పట్టకూడదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.
  • గురువారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో డెల్టా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
  • ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి సాధించాలంటే కచ్చితంగా ఇంగ్లీష్‌ భాష అవసరమని.. అలాగే మాతృభాషను కూడా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
  • నదుల అనుసంధానం అనేది ప్రధాన ప్రక్రియ అని, అది జరిగితే ఆహార సమస్య ఉండదని చెప్పారు.
  • గోదావరి నీటిని ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమకు కూడా అందించే ప్రయత్నం చేస్తామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం చాలా సంతోషకరమన్నారు.
  • గోదావరి అంటే ఎంతో ఇష్టం..
  • రాజమండ్రిలో మరిన్ని విద్యాలయాలు, వైద్యాలయాలు రావాలన్నారు.
  • గోదావరి ప్రాంతానికి రావడం అంటే తనకెంతో ఇష్టమన్నారు.
  • కార్యక్రమం పెద్దది కాకపోయినా.. సేవా కార్యక్రమం కావడంతో హాజరయ్యానన్నారు.
  • దేశంలో టెలీ మెడిసిన్‌ విస్తృతం కావాలన్నారు.
  • ప్రపంచంలో అనేక చోట్ల భారతీయ వైద్యులు సేవలందిస్తున్నారన్నారు.
  • అమెరికాలో మొదటి టాప్ టెన్ వైద్యుల్లో ఐదుగురు భారతీయులేనని తెలిపారు.
  • అందరూ ప్రోటీన్‌ ఫుడ్‌ తీసుకునే ప్రయత్నం చేయాలని వెంకయ్య నాయుడు సూచించారు.