Loading...

Explore Projects Across the Rajahmundry

ఐటీ రంగం అభివృద్ధికి చర్యలు

ఐటీ రంగం అభివృద్ధికి చర్యలు

మంత్రి పితాని సత్యనారాయణ

కోరుకొండ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని బుధవారం ఆయన రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల నాయకులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. అమెరికాలోని 3 రాష్ట్రాల్లో పర్యటించి, అక్కడ జరిగిన సమావేశాల్లో పాల్గొన్నానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. హెచ్‌-1 వీసాపై ఉన్న సమస్యల గురించి సీఎం చంద్రబాబునాయుడు ద్వారా ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్గాని నాగేశ్వరరావు, మార్గాని రామకృష్ణగౌడ్‌, చంటిబాబు, బొర్రా శేఖర్‌, సారథి, రమేష్‌, సత్తిబాబు తదితర నాయకులు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *