Loading...

Explore Projects Across the Rajahmundry

ఏపీలో రైల్వేల అభివృద్ధికి అవకాశం

ఏపీలో రైల్వేల అభివృద్ధికి అవకాశం

దుద్దుకూరు(దేవరపల్లి), న్యూస్‌టుడే(possibility of the development of railways in Andhra): కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు మన రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నందున ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధికి అవకాశం వచ్చిందని రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్‌ పేర్కొన్నారు. దేవరపల్లి మండలం దుద్దుకూరులో తెదేపా నాయకుడు కాకర్ల వెంకట్రావు ఇంటి వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైను అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైను సర్వే పనులు త్వరలో పూర్తవుతాయన్నారు. దేశంలో అన్ని ఎన్నికలూ ఒకేసారి జరపాలన్న ప్రధాని మోదీ ఆలోచన మంచిదేనని మురళీమోహన్‌ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ కూడా ఇదే కోరుకున్నారన్నారు. తరచూ ఎన్నికలు జరగడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *