Loading...

Explore Projects Across the Rajahmundry

‘ఉపాధ్యాయ పదోన్నతుల్లో జాప్యం తగదు’


‘ఉపాధ్యాయ పదోన్నతుల్లో జాప్యం తగదు’

దివాన్‌చెరువు(రాజానగరం), న్యూస్‌టుడే:‘ఉపాధ్యాయ పదోన్నతుల్లో జాప్యం తగదు’…………..

దశాబ్దానికి పైగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి ప్రత్యామ్నాయ

విధానంలో వెంటనే షెడ్యూల్‌ ప్రకటించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) రాష్ట్ర ప్రధాన

కార్యదర్శి గాజుల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

దివాన్‌చెరువు గ్రామంలో ఆదివారం జరిగిన ఎస్టీయూ జిల్లా శాఖ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన స్థానిక విలేకరులతో

మాట్లాడుతూ అడ్‌హాక్‌ రూల్స్‌లో మేనేజ్‌మెంట్‌ వారీగా పదోన్నతులు చేపట్టాలని, రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని,

కేవలం 9,600 పోస్టులకు మాత్రమే డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు.

విద్యాహక్కు చట్టం మేరకు 23 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యా ప్రమాణాలు కాపాడాలన్నారు.

మున్సిపల్‌, నగరపాలక పాఠశాలల టీచర్లకు సంబంధించి 506, 507 జీవోలను అమలు చేసి బదిలీలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

సీపీఎస్‌పై ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామన్నారు. ఈ నెల 23న చలో గుంటూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో ఎస్టీయూ నేతలు డి.వెంకట్రావు, పి.దొరబాబు, పి.సుబ్బరాజు, ఎస్‌.జె.త్రినాథ్‌బాబు, కె.వి.శేఖర్‌, పి.వి.వి.సత్యనారాయణరాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *