ఉత్కంఠభరితంగా అంగ్రూ క్రీడా, సాంస్కృతిక పోటీలు
ఉత్కంఠభరితంగా అంగ్రూ క్రీడా, సాంస్కృతిక పోటీలు
బాపట్ల, న్యూస్‌టుడే :ఉత్కంఠభరితంగా అంగ్రూ క్రీడా, సాంస్కృతిక పోటీలు
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(అంగ్రూ) రాష్ట్రస్థాయి అంతర్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజయం కోసం జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.
వంద మీటర్ల పరుగు పందెంలో భవిత (గుంటూరు- విజ్ఞాన కళాశాల) ప్రథమ, సాయిప్రపుల్ల సరి(ఎస్ఎఫ్ఎస్టీ- బాపట్ల) ద్వితీయ స్థానంలో నిలిచారు.
షాట్‌పుట్‌లో తేజస్విని(రాజమహేంద్రవరం- ఏజీ కళాశాల), శిరీషాకుమారి(సీఎఫ్ఎస్టీ- పులివెందుల) ఉమాదేవి(ఎస్వీ ఏజీ- కళాశాల తిరుపతి) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.
వాలీబాల్‌లో బాపట్ల ఫుడ్‌సైన్స్ కళాశాల జట్టు, ఏజీ ఇంజినీరింగ్ కళాశాల మడకశరి తుదిపోరుకు చేరుకున్నాయి.
బాల్‌బ్యాడ్మింటన్‌లో ఏజీ కళాశాల బాపట్ల ఫైనల్‌కు చేరుకొంది. టేబుట్ టెన్నిస్‌లో ఏజీ ఇంజినీరింగ్ కళాశాల మడకశిర విజేతగా నిలిచింది.
బాపట్ల ఏజీ కళాశాల రెండోస్థానంతో సరిపెట్టుకొంది.
చదరంగంలో రాజమహేంద్రవరం ఏజీ, బాపట్ల ఏజీ కళాశాలల తుదిపోరులో తలపడనున్నాయి.
క్యారమ్స్‌లో ఫుడ్‌సైన్స్ బాపట్ల, ఏజీ కళాశాల బాపట్ల ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి.
టెన్నీకాయిట్లో ఏజీ కళాశాల నైరా, ఏజీ కళాశాల బాపట్ల క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి.