Loading...

Explore Projects Across the Rajahmundry

ఆధునికీకరణకు నిర్లక్ష్య గ్రహణం

ఆధునికీకరణకు నిర్లక్ష్య గ్రహణం

ముందుకుసాగని ఏలేరు కాలువల పనులు

ప్రధాన అడ్డంకిగా మారిన భూసేకరణ  దిక్కుతోచని స్థితిలో ఆయకట్టు రైతులు

న్యూస్‌టుడే, కిర్లంపూడి

ఏలేరు ఆధారిత పరిధిలో 67 వేల ఎకరాల నిర్దిష్ట ఆయకట్టు ఉంది. దీంతో పాటు మరో 30 వేల ఎకరాలకు అదనంగా సాగునీటిని అందించేలా పనులు ప్రారంభించారు. వీటిని రెండు దశలుగా విభజించి మొదటి దశ పనులను రూ.127.59 కోట్లతో 2014 మే నెలలో చేపట్టారు. ఇవి ఈ ఏడాది మే నెలకు  పూర్తికావాల్సి ఉంది. రెండో దశ పనులు రూ.137 కోట్లతో ఈఏడాది మార్చిలో ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటికీ టెండర్లు పూర్తికాలేదు. ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో ఆయకట్టు విస్తరించి ఉంది. ఎప్పుడో నీటి వాలుకు వీలుగా ఏర్పడిన కాలువల పైనే అక్కడక్కడా నిర్మాణాలు చేపట్టి సాగునీటిపారుదల వ్యవస్థను నిర్వహిస్తున్నారు. 25 ఏళ్ల కిందట రూ.25 కోట్లతో ప్రారంభమైన ఏలేరు ఆధునికీకరణ అంచనా విలువ ప్రస్తుతం రూ.260 కోట్లకు చేరింది.

ఏలేరు ఆధారిత కాలువను పూర్తి స్థాయిలో విస్తరించేందుకు 790 ఎకరాలు అవసరం అవుతుంది. ఇందులో 460 ఎకరాలు ప్రభుత్వ భూమిలోని కాలువలు కాగా వాటి వెంట ఉన్న 335 ఎకరాలు సేకరించాల్సి ఉంది. పిఠాపురం, కిర్లంపూడి, పెద్దాపురం సెక్షన్ల పరిధిలో 130 ఎకరాలు రైతుల నుంచి సేకరించి వారికి రూ.30 కోట్లు చెల్లించారు. ఇంకా 205  ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇందులో పిఠాపురం మండలం గోకివాడ, రాపర్తి, జములపల్లి, కోలంక, భోగాపురం, ఇల్లింద్రాడ గ్రామాల్లో 110 ఎకరాలు, కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామంలో 33
ఎకరాలకు సంబంధించి సర్వే ప్రక్రియ పూర్తయినా నిధులు విడుదల కాలేదు. మరో 65 ఎకరాలు కిర్లంపూడి మండల పరిధిలోని భూపాలపట్నం, గెద్దనాపల్లి, రామకృష్ణాపురం, రాజుపాలెం, ఎస్‌.తిమ్మాపురం, తామరాడ, పెద్దాపురం మండలం కాండ్రకోట, కట్టమూరు, ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామాల పరిధిలో సేకరించాల్సి ఉంది. దీనికి ఇప్పటి వరకు సర్వే ప్రక్రియే పూర్తికాలేదు. ఈ భూములకు సుమారు రూ.50 కోట్లు అవసరం కానున్నాయి.80 శాతం నిర్మాణాలు పూర్తి
.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *