Loading...

Explore Projects Across the Rajahmundry

అవిగవిగో.. ప్రత్యేక పారిశ్రామిక వాడలు

అవిగవిగో..

ప్రత్యేక పారిశ్రామిక వాడలు

నియోజకవర్గాల్లో ఏర్పాటుకు సన్నాహాలు

815.47 ఎకరాల భూమి గుర్తించిన పరిశ్రమల శాఖ

ఈనాడు, రాజమహేంద్రవరం

జిల్లాలో పారిశ్రామిక రంగం విస్తరిస్తున్న నేపథ్యలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనూ ప్రత్యేకంగా కొంత ప్రాంతాన్ని గుర్తించి స్థానిక ఔత్సాహికులను ఉత్పత్తి రంగం వైపు ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ దిశగా జిల్లా యంత్రాంగం అన్ని నియోజకవర్గాల్లో అందుకు అనువైన స్థలాల సేకరణకు కసరత్తు చేస్తోంది. ఒక్కోచోట కనీసం 50 ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా ఇప్పటి వరకూ ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 815.47 ఎకరాలను గుర్తించగా, అందులో ఇప్పటి వరకు ఏపీఐఐసీ 136.52 ఎకరాలు తమ అధీనంలోకి తీసుకుంది. 52.67 ఎకరాలను ఇప్పటికే కొందరికి కేటాయించింది.

మొత్తం గుర్తించిన భూముల్లో ప్రభుత్వ భూమి 251.27 ఎకరాలుండగా, మిగతా మొత్తం డీకేటీ భూములున్నాయి. వీటిలో కొన్నింటికి సంబంధించి దస్త్రాల ప్రక్రియ కొనసాగుతుండగా, మరికొన్ని ఆర్థిక పరమైన అంశాలతో ముడిపడి ఉన్నాయి. ఒకచోట రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో, అదే ప్రాంతంలో ప్రత్యామ్నాయ భూములను చూశారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే క్వారీలు నిర్వహించి, గోతులతో ఉన్న ప్రాంతాలను రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. వీటిని పూడ్చి, తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా పరిశ్రమల శాఖ ముందుకొస్తోంది. ఈ విధానంలో స్థానికంగా నిరుపయోగంగా ఉన్న భూములు వినియోగంలోకి రావడంతో పాటు స్థానికంగా పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది.

ఇలా గుర్తించారు…
 తుని నియోజకవర్గం పరిధి ఎల్‌.కొత్తూరులో 32.03 ఎకరాలను గుర్తించి, సుమారు రూ. 6.28 కోట్ల మేర పరిహారం అందజేయాలని జిల్లా అధికారులు భావించారు. ఆయా భూములిచ్చేందుకు రైతులు వ్యతిరేకించడంతో, అదే ప్రాంతంలో మరోచోట స్థలాన్ని చూశారు.ఏ
 ప్రత్తిపాడు నియోజకవర్గంలో శంఖవరం మండలం రామవరప్పాడులో 18.48 ఎకరాలను గుర్తించగా, ఏపీఐఐసీ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ భూమి ఉపరితలానికి లోతుగా ఉందని.. సుమారు 30 మీటర్ల మేర మెరక చేయాల్సి ఉంటుందని పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమ పెట్టేందుకు ఓ సిరామిక్‌ సంస్థ దరఖాస్తు చేసుకుంది.
 పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలంలో 100 ఎకరాలు గుర్తించినప్పటికీ స్థానికులు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పెండింగ్‌లో ఉంది.
 అనపర్తి నియోజకవర్గం పరిధి బిక్కవోలు మండలం బలభద్రపురంలో 34.19 ఎకరాలను గుర్తించగా, ఇప్పటికే ఆ స్థలాన్ని ఏపీఐఐసీ స్వాధీనం చేసుకుంది. రంగంపేట మండలంలో కొత్తపాడు వద్ద 104.24 ఎకరాలను గుర్తించగా, దీనికి సంబంధించి నివేదికను ఆర్డీవో సంయుక్త కలెక్టర్‌ అందజేశారు. ఈ మండలంలోని వెంకటాపురంలో మరో 34.93 ఎకరాలు గుర్తించారు. దీనికి సంబంధించి విలువ నిర్ధారణకు జిల్లా యంత్రాంగానికి, పరిశ్రమల శాఖకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి.
 మండపేటలోని వేములపల్లిలో 30.45 ఎకరాలున్నట్లు గుర్తించి, గతేడాది సెప్టెంబరులో స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమిలో 50 శాతం మేర గోతులున్నాయని, రెండు మీటర్ల మేర మెరక చేయాల్సి ఉందని పరిశ్రమల శాఖ చెబుతోంది.
 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *