Loading...

Explore Projects Across the Rajahmundry

అంతర్వేదిలో అలజడి

అంతర్వేదిలో ‘అల’జడి

అంతర్వేది, న్యూస్‌టుడే : అంతర్వేది నుంచి కరవాక వరకు సుమారు నలభై కిలోమీటర్ల సముద్రపు తీరం వరకు మంగళవారం కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. నాలుగు రోజుల నుంచి సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కెరటాలు ఎగసిపడుతూ సుమారు 200 మీటర్ల నుంచి 400 మీటర్ల వరకు సముద్రపు నీరు ముందుకు వచ్చింది. దీంతో తీర ప్రాంత గ్రామాల ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఇలా ఉండటం పరిపాటేనని భావించిన స్థానికులు ఆ తిథులు దాటినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అంతర్వేది బీచ్‌లో కెరటం సుమారు 200 మీటర్లు ముందుకు వచ్చింది. అంతర్వేదికరలో సరుగుడు తోటలను దాటుకుంటూ ఆక్వా చెరువులు, గృహాల వద్దకు సముద్రం నీరు చొచ్చుకొచ్చింది. కరవాక వరకు ఇదే పరిస్థితి ఉందని తీర ప్రజలు అంటున్నారు. విషయం తెలుసుకున్న సఖినేటిపల్లి తహసీల్దార్‌, ఎస్సై పవన్‌కుమార్‌ సముద్రం వద్దకు చెరుకుని ఎవరూ సమీపంలోకి వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టారు. సాగర సంగమం వద్ద మరింత ఉద్ధృతంగా ఉండడంతో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లడానికి సహసించడం లేదు. దీంతో వీరు జీవనోపాధి కోల్పోయి, పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. తీరంలో రైతలు తోటలకు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *